హర్ సర్కిల్ ఎవిరిబాడీ ప్రాజెక్టు ప్రారంభం !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ వ్వవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా ఎం అంబానీ ది హర్ సర్కిల్, ఎవిరీబాడీ ప్రాజెక్టును ప్రారంభించారు. మహిళల్లో భౌతికపరమైన ఆత్మన్యూనతా భావాన్ని పారదోలి వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, శారీరక, వయసు, రంగు, మత, భౌతికపరమైన వివక్షలేని సమానమైన ఆవకాశాలను కల్పించడం ఈ ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2021లో నీతా అంబానీ హర్ సర్కిల్ డ్రైవ్‌ను ప్రారంభించారు. మహిళలకు సురక్షిత, సంపూర్ణ అభివృద్ధిదాయరమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్ కల్పించడమే హర్ సర్కిల్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం రెండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో 31 కోట్ల మందికి చేరువైంది. హర్ సర్కిల్ ఎవిరిబాడీ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా నీతా అంబానీ ఒక వీడియో సందేశం ఇస్తూ హర్ సర్కిల్ అన్నది మహిళల్లో సోదరీభావాన్ని పెంపొందించడంతోపాటు సంఘీభావాన్ని ప్రకటించడమని అన్నారు. సమానత్వం, ఏకత్వం, అందరినీ గౌరవించడం అనే సూత్రాల ప్రాతిపదికన సంఘీభావం ఏర్పడుతుందని, ఇదే తమ కొత్త ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతున్నాయని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ తెలుసుకోకుండానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని నీతా అంబానీ అన్నారు. వైద్య పరమైన సమస్యలు, లింగవివక్షకు సంబంధించిన సమస్యలు వంటి అనేక సమస్యలపై మహిళలు పోరాడుతుంటారని, కాని అవేవీ తెలియకుండా కొందరు ట్రోలింగ్ చేస్తుంటారని ఆమె తెలిపారు. ఇవి మహిళలకు ముఖ్యంగా యువజనులకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ రకమైన అనేక సమమస్యలకు తమ కొత్త ప్రాజెక్టు పరిష్కారం సూచించగలదన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం, వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారవేదికగా ఈ సామాజిక ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది. జీవనమార్గం, ఆరోగ్యం, ఆర్థికం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సేవ, అందం, ఫ్యాషన్, వినోదం, సృజనాత్మకత, భావ వ్యక్తీకరణ, ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించడం తదితర అనేక అంశాలపై మహిళల సారథ్యంలోని ఎన్‌జిఓలు, ఇతర సంస్థలు పరిష్కారాలను, సూచనలను అందచేస్తాయి. ఆరోగ్యం, వెల్‌నెస్, విద్య, వ్యాపార రంగం, ఆర్థికం, దాతృత్వం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై రిలయన్స్‌కు చెందిన నిపుణులు మహిళలకు సూచనలు, సలహాలు అందచేస్తారు. ఈ వేదిక ద్వారా మహిళలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగ, వ్యాపార రంగాలలో కొత్త అవకాశాలను సాధించుకోవడానికి అవకాశం లభిస్తుంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)