ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర !

Telugu Lo Computer
0


అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపించారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీపై రాఘవ్ చద్దా తీవ్ర ఆరోపణలు చేశాడు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ''ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీలో చేరాలని ఆప్ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తోంది. లేకుంటే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వాళ్లకు డబ్బు ఆశ చూపుతోంది. దీని ద్వారా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేస్తోంది. కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వానికి అసెంబ్లీలో 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లాగే ఇక్కడ కూడా ప్రభుత్వాల్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో బీజేపీ వరుసగా ఓడిపోతోంది. అందుకే బీజేపీ మా ఎమ్మెల్యేలను బెదిరిస్తోంది. ఇలాంటి ప్రయత్నాల్ని బీజేపీ మానుకోవాలి. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలెన్నో చేసింది. కానీ, మా ఎమ్మెల్యేలు లొంగలేదు'' అని రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. ఢిల్లీ బడ్జెట్ సెషన్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు బీజేపీ చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)