కుల దురహంకార హత్యల నిరోధానికి చర్యలు

Telugu Lo Computer
0


కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ తెలిపారు. గురువారం నాడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కుల దురహంకార హత్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కుల దురహంకార హత్యలను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇటీవల కృష్ణగిరి జిల్లాలో కావేరిపట్నంలో జగన్‌ అనే యువకున్ని అతని మామే కొందరి వ్యక్తులతో కలిసి హత్య చేసిన సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఇకె పళినిస్వామి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ స్టాలిన్‌ ఈ వివరాలు తెలిపారు. 'సామాజిక న్యాయానికి భూమి అయిన తమిళ నాడులో ఇలాంటి సంఘటనలను నిరోధించడానికి అసెంబ్లీలో ఉన్న సభ్యులందరూ పార్టీలకు అతీతంగా కలిసిరావాలి' అని స్టాలిన్‌ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)