సమాధిపై క్యూఆర్‌ కోడ్‌

Telugu Lo Computer
0


కేరళలో డాక్టర్‌ ఇవిన్‌ ఫ్రాన్సిస్‌ అనే ఓ యువ వైద్యుడు బాడ్మింటన్‌ ఆడుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. 26 ఏండ్ల వయసులోనే అకాల మరణం చెందాడు. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరిగింది. కానీ, వైద్యునిగా ఆయన సృజనాత్మకత మాత్రం సజీవంగా నిలిచిపోయింది. ఇవిన్‌ తల్లిదండ్రులు త్రిసూర్‌లోని చర్చి వద్ద తమ కుమారుడి సమాధి రాయిపై ఓ క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకాలను పదిలంగా నిలిపారు. ఆ క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఇవిన్‌కు సంబంధించిన వీడియోలను తిలకించి ఆయన సృజనాత్మకతను, ప్రతిభను అందరూ తెలుసుకునే ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో ఇవిన్‌ ప్రతిభను చాటే వీడియోలతో ఆయన కుటుంబం ఓ వెబ్‌పేజీని రూపొందించి ఆ క్యూఆర్‌ కోడ్‌కు లింక్‌ చేయడంతో ఇది సాధ్యమైంది. డాక్టర్‌ ఇవిన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలిచేలా చూసేందుకే ఆయన సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)