నవీన్ హత్య కేసు గుట్టు విప్పిన నిహారిక

Telugu Lo Computer
0


నవీన్ హత్య కేసులో నిహారిక విస్తుపోయే నిజాలు బయటపెట్టింది. ఈ కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిహారిక..కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది.ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ తాను ప్రేమించుకున్నామని, నవీన్ తాను చాలాసార్లు ఇంట్లో కలుసుకునేవాళ్లమని వెల్లడించింది. నవీన్ తాను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడని చెప్పింది. నవీన్తో గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకున్నానని, నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడని పేర్కొంది. నవీన్ తనతో మాట్లాడడం నచ్చని హరి హరికృష్ణ ఒకసారి నవీన్ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని చెప్పాడని తెలిపింది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని నేను మందలిస్తే సరదాగా అన్నాను అన్నాడు. కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నవీన్ ను చంపడానికి కొన్న కత్తిని, రెండు జతల గ్లౌజ్ను తీసి నాకు చూపించాడు. నేను నమ్మలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు. అలాంటివి చేయకు జైలుకు వెళ్తావు. నేను అతనితో మాట్లాడతలేనుగా అతనే నన్ను మరిచిపోతాడు. అలాంటి పిచ్చి పనులు చేయకు అని హరిని మందలించాను. దాంతో ఊరికే సరదాకి అన్నాను అని హరి చెప్పాడు. జనవరి 15న హరి నాకు ఫోన్ చేసి జనవరి 16వ తేదీన తన స్నేహితులందరూ గెట్ టు గెదర్ పార్టీ చేసుకుంటున్నాము అని చెప్పాడు. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడు. కానీ పార్టీ క్యాన్సల్ అయిందని మరుసటి రోజున నాకు హరి ఫోన్ చేసి చెప్పాడు. ఫిబ్రవరి 17  ఉదయం 9:40 గంటలకి నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను అని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్ కాల్ చేస్తే నేను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడు. నేను కూడా నవీన్ తో అదే విషయం చెప్పాను. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత హరి నాకు కాల్ చేసి నవీన్ ఇంకా నీతో మాట్లాడడంట అని అంటే నేను సరే అన్నాను. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని మెసేజ్ చేశాడు. శివరాత్రి రోజున ఉదయం 9:30 గంటలకు వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిశాను. అప్పుడు హరి పాత బట్టలు వేసుకుని వచ్చాడు. ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు, ఎవరివి బట్టలు అని అడిగాను. నవీన్ ని నేను రాత్రి చంపేశాను. నా బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నాను. హసన్ కి కూడా నవీన్ హత్య విషయం చెప్పాను. హసన్ తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్ ని వారి ఇంటికి దూరంగా  చెట్లలో పడేసినట్లు నాతో చెప్పాడు. నేను అతనితో ఎందుకు అలా చేశావు. మాట్లాడుకుని ఉండొచ్చు కదా అన్నాను. ఆ తర్వాత హరి వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగితే నేను హరికి రూ. 1500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పాను.  అప్పుడు హరి తన నాన్న దగ్గరికి వరంగల్ వెళ్తాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని నేను నవీన్ స్నేహితులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి చెప్పకుండా దాచి పెట్టాను. ఫిబ్రవరి 20న నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తుండగా, హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్ స్టాప్లో నన్ను కలిశాడు. కొద్దిసేపు నాతో మాట్లాడి నవీన్ ని చంపిన చోటుని... తలపడేసిన చోటుని చూపిస్తానని చెప్పాడు. అతని బండిమీద ఎక్కించుకొని బి.యన్.రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేసినట్లు హరి చూపించాడు. అక్కడి నుండి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగు పారవేసిన ఏరియాను ..ఆ తర్వాత బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కంపెనీ ప్రక్కన నవీన్ తలని, అతని ప్యాంటు, కత్తి, సెల్ ఫోన్ పడేసిన స్థలమని దూరం నుండి నాకు హరి చూపించాడు. అక్కడి నుండి ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్డుమీదుగా వెళ్లి... అబ్దుల్లాపూర్మెట్ లో అమృత ఫ్యామిలీ డాబా లో నేను, హరి ఇద్దరం సాయంత్రం 4:30 గంటలకు బిర్యానీ తిన్నాం. అక్కడి నుండి తిరిగి వస్తూ నవీన్ ను చంపిన ప్లేస్ ఇటువైపు అని దారిలో నాకు చూపించి.. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. నవీన్ ఫ్రెండ్స్, నవీన్ మామ వాళ్లు పదే పదే ఫోన్ చేసి నవీన్ ఎక్కడున్నాడు అని అడిగారు. అయినా వారి దగ్గర నిజం దాచి, నాకు తెలియదు అని చెప్పిన. కామన్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వమంటే హరి ఫోన్ నెంబర్ మెసేజ్ చేసిన. ఫిబ్రవరి 21 రోజు ఉదయం 10 గంటలకు నవీన్ వాళ్ళ మామ హరికి ఫోన్ చేసి  అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని చెప్పినట్లు హరి నాతో చెప్పాడు. ఈ సమయంలో హరి తన ఫోన్ స్విచాఫ్ చేసుకుంటాను. వేరే వాళ్ల ఫోన్లు మాట్లాడుతూ నవీన్ విషయం గురించి తెలుసుకుంటాను అని హరి అన్నాడు. ఏదైనా ఉంటే హసన్ తో ఫోన్లో టచ్ లో ఉండమని హరి నాకు చెప్పాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్లీ నవీన్ వాళ్ళ మామ, నవీన్ ఫ్రెండ్స్ నాకు కాల్ చేశారు. నాకు భయం వేసి మా బావ భూపాల్ రెడ్డికి జరిగిన విషయం చెప్పకుండా దాచిపెట్టి నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పిన. ఆ సమయంలో నవీన్ మామ నాకు ఫోన్ చేసి..నవీన్ గురించి అడుగుతుంటే.. మా బావ భూపాల్ రెడ్డి నా ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడాడు. మీ అబ్బాయి గురించి మాకు తెలియదు, నేను అడ్వకేట్ ని పదేపదే నిహారిక కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఎవరు ఫోన్ చేయలేదు. ఫిబ్రవరి 23 న నేను హసన్ కు కాల్ చేసిన, హరి మిస్సయినాడని, వాళ్ళ అక్క బావ మలక్ పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్లని, నన్ను పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయ్. నిన్ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తారేమో అని హసన్ చెప్పాడు. అప్పుడు నేను చాట్ ని, ఇన్ స్టాగ్రామ్లో మెసేజ్లను అన్ని డిలీట్ చేసిన. ఫిబ్రవరి 24 న  నా ఫ్రెండు కు హసన్ ఇన్ స్టా ద్వారా మెసేజ్ చేశాడు. నన్ను ఎవరికి ఫోన్ చేయవద్, ఎవరితో మాట్లాడవద్దు, హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదు అని చెప్పమన్నాడు. ఆ తర్వాత 24న ఉదయం 8:30 గంటలకు నేను హరిని కలిశాను. నేను పోలీసులకు లొంగిపోతాను అని హరి అని వెళ్లిపోయాడు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటకు హరి మళ్లీ కలిశాడు. నవీన్ తల అతని భాగాలు బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వేయి, లేదంటే మాపైన కూడా అనుమానం వస్తది అని హసన్ చెప్పినట్టు హరి నాతో అన్నాడు. హసన్ సూచన మేరకు రాజీవ్ గృహకల్ప దగ్గర పడేసిన నవీన్ అవయవాల బ్యాగ్ ను హరి హత్య చేసిన ప్లేస్ లో పడేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్లాం. ఈ విషయాన్ని మా బావ అడ్వకేట్ భూపాల్ రెడ్డికి హరి చెప్పగా  ఇది పెద్ద కేసు వెంటనే పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆ తర్వాత హరి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 24 న లొంగిపోయాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)