రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగుతా !

Telugu Lo Computer
0


'మోడీ ఇంటి పేరు' కామెంట్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగుతానని ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ హెచ్చరించారు. గురువారం ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. ''నేను పారిపోయానంటూ కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కేసులో నైనా దోషిగా తేలానా? ప్రతిపక్ష నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని బ్రిటన్ కోర్టుకు లాగాలని నేను నిర్ణయించుకున్నాను. ఆయన కోర్టులో ఫూల్ అవడం ఖాయం' అంటూ లలిత్ మోడీ ట్వీట్ చేశారు. ''గత 15 ఏండ్లలో నేను ఒక్క రూపాయి దోచుకున్నట్టు కూడా నిరూపణ కాలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీఎల్​ను సృష్టించాను. 1950 నుంచి దేశానికి గాంధీ ఫ్యామిలీ చేసిన దాని కంటే మోడీ ఫ్యామిలీ చేసిందే ఎక్కువ'' అని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)