ఆలయ విధ్వంసాలపై ఆస్ట్రేలియా ప్రధాని హామీ !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌, ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియాలోని దేవాలయాల ధ్వంసం గురించి ప్రస్తావించారు. ఆ విషయంలో భారతీయ కమ్యూనిటీలకు భద్రత కల్పిస్తామని ప్రధాని అల్బనీస్‌ తనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు మోడీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులకు సంబంధించిన నివేదికలు చూశాను. దీని గురించి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు తెలియజేశాను. ఆయన ఆస్ట్రేలియాలోని భారతీయ కమ్యూనిటీల భద్రత, శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కాగా, ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాన్ని భారత్‌ పదేపదే ఖండించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ సమస్యను లేవనెత్తింది. గత వారం, బ్రిస్బేన్‌లోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీ నారాయణ్ ఆలయంపై ఖలిస్థాన్ అనుకూల మద్దతుదారులు దాడి చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)