ఖమ్మం-విజయవాడ మధ్య ఫోర్ లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 14 March 2023

ఖమ్మం-విజయవాడ మధ్య ఫోర్ లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే !


తెలంగాణలో ఎన్‌హెచ్‌-163జిపై ఖమ్మం-విజయవాడ మధ్య 4 వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆర్థిక నడవాలో భాగంగా వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య మొదటి ప్యాకేజీలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో చేపట్టే ఈ 29.92 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.983.90 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల వాహన నిర్వహణ వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతాయని గడ్కరీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రహదారి వసతులను పెంచి దక్షిణాదిలోని పోర్టులను మధ్యభారతంతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర మంత్రి వెల్లడించారు.

No comments:

Post a Comment