బెంగళూరులో భారీ వర్షం !

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు విపరీతమైన వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వానలతో పాటు కరెంట్ కట్ కావడంతో పలు ప్రాంతాల్లోని రహదార్లు చీకటి మయం అయ్యాయి. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన చాలా మంది వర్షంలో చిక్కుకుని ఎక్కడవాళ్లు అక్కడే ఉండిపోయారు. నగరంలోని జయనగర, మడివాళ, జయనగర, సర్దాపుర, హెచ్ఎస్ఆర్ లేఔట్, బాణసవాడి, కేఆర్ పురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెజస్టిక్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మల్లేశ్వరం, రాజాజీనగర, బసవేశ్వరనగర, విధానసౌధ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. అయితే జయనగర, మడివాళ, బాణసవాడి పరిసర ప్రాంతాల్లో వాన దెవుడు దుమ్ముదులిపేయడంతో పలు ప్రాంతాల్లో చెట్టు విరిగి రోడ్ల మీదపడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)