సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయండి : మస్క్‌ను కోరిన బీజేపీ

Telugu Lo Computer
0


మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఒక క్రిమినల్ అంటూ పేర్కొంది. మనీష్ సిసోడియా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ ఎలాన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సిసోడియా ట్విట్టర్ ఖాతాను మరొకరు హ్యాండిల్ చేస్తున్నారని కాబట్టి అతని ఖాతాను బ్లాక్ చేయాలని బగ్గా ఎలన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు. సరైన ఆధారాలు లేకుండా తనను అరెస్టు చేసి మద్యం పాలసీ కేసులో ఇరికించారని అధికార బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బగ్గా ఈ విధంగా పేర్కొన్నారు. దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని వారు (బీజేపీ) జైలుకు పంపుతున్నారని అందులో సిసోడియా పేర్కొన్నారు. అయితే జైలులో ఉన్న సమయంలో ఆ అకౌంట్ నుంచి ట్వీట్ రావడం ఆసక్తికరంగా మారింది. ''దేశంలో స్కూళ్లు తెరిచినప్పుడు జైళ్లు మూతపడతాయని ఈ రోజు వరకు విన్నాను. కానీ ఇప్పుడు వీరు దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని మాత్రమే జైల్లో పెట్టడం ప్రారంభించారు'' అని సిసోడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ ప్రత్యక్షమైంది. దీంతో సిసోడియా ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని బగ్గా ఎలన్ మస్క్ ను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)