ఆస్ట్రేలియాలో అకృత్యాలకు పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి !

Telugu Lo Computer
0


ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్‌ ధన్‌కర్‌ ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్‌ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్‌ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువ మంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్‌ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్‌ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి. 2018 జనవరి- అక్టోబర్‌కాలంలో ఇతడు 13 మంది  మహిళలను రేప్‌ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్‌ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్‌ బాటిళ్లు, రేప్‌ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్‌ దొరికింది. బాలేశ్‌ నేరాలపై న్యూసౌత్‌ వేల్స్‌ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)