సాకారమైన ఒడిశా ప్రజల చిరకాల స్వప్నం !

Telugu Lo Computer
0


ఒడిశా మాజీ ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్ ఉపయోగించిన చారిత్రక ''డకోటా డిసి-3'' విమానాన్ని ఆయన కుమారుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారంనాడు ఆవిష్కరించారు. అసోం ప్రజలకు దీనిని అంకితం చేశారు. భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని 1.1 ఎకరాల స్థలంలో దీనిని ఏర్పాటు చేశారు. అసోం ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 23 ఏళ్లు పూర్తి చేసుకోవడం, బిజూ పట్నాయక్ 107 జయంతి సందర్భంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కరణ కావడం విశేషం. ఒడిశా మాజీ సీఎం, దివంగత బిజూ పట్నాయక్ చివరిసారిగా ఉపయోగించిన 'డకోటా డిసి-3'  విమానం దశాబ్దాలుగా కోల్‌కతాలోని నేతాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉండిపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ ఐకానిక్ విమానాన్ని ఒడిశాకు రప్పించాలని నవీన్ పట్నాయక్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నం ఫలించి, భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ వద్ద 1.1 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఇటీవల కేటాయించింది. కరోనాతో కొద్దికాలం జాప్యం జరిగిన అనంతరం ఎట్టకేలకు విమానం తరలింపు ప్రక్రియ మొదలైంది. డకోటా విమానాన్ని పలు భాగాలుగా విడదీసి 3 లారీల్లో కోల్‌కతా విమానాశ్రయం నుంచి ఒడిశాకు తరలించారు. ఈ ఏడాది జనవరి 18న ఒడిశాకు చేరుకున్న విమాన విడిభాగాలను ఏరోస్పేష్ రీసెర్చ్ డవలప్‌మెంట్‌కు చెందిన 10 మంది సభ్యుల నిపుణుల బృందం 12 రోజుల పాటు శ్రమించి పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకువచ్చింది. ఐకానిక్ డకోటా విమానం ప్రజాసందర్శనార్థం ఉంచడంతో అసోం చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైందని నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఒడిశా ఐటీ కార్యదర్శి మనోజ్ మిశ్రా ఆదివారంనాడు తెలిపారు. ఇది తమందరికి భావోద్వేగంతో కూడిన రోజు అని అభివర్ణించారు. బిజూ పట్నాయక్ గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయని, ఇండోనేషియా ప్రజలను ఏ విధంగా సురక్షితంగా తన డకోటా విమానానంలో జమ్మూకశ్మీర్‌లోని లెహ్‌కు ఆయన తరలించారో, సాహసవీరుడుగా ఎలా చిరస్మరణీయుడిగా నిలిచిపోయారో చరిత్ర చెబుతుందన్నారు. ఒడిశా డేర్‌ డెవిల్‌గా ఆయన పేరు చిరస్మరణీయమని చెప్పారు. డకోటా విమానాన్ని కోల్‌కతా విమానాశ్రయం నుంచి తీసుకువచ్చినప్పుడు అది చాలా శిథిలావస్థలో ఉందని, దానికి పునర్వైభవాన్ని తీసుకువచ్చామని, అదే ఇప్పుడు మన కళ్ల ముందు ఒక విశిష్ట ఆవిష్కరణగా మన ముందు నిలిచిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు కూడా ఈ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని అన్నారు. కాగా, ప్రజా సందర్శన కోసం ఒక ఐకానిక్ విమానాన్ని ఎయిర్‌పోర్ట్ ముందు ఏర్పాటు చేయడం బహుశా ప్రపంచంలోనే ఇది తొలిసారని ప్రముఖ చరిత్రకారుడు అనిల్ థీర్ తెలిపారు. బిజూ పట్నాయక్ సాహసకృత్యాలను కళ్లకు కట్టేటట్టు ఆవిష్కరించే ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దివగంత బిజూ పట్నాయక్ రాజకీయాల్లోకి రాకముందు, బ్రిటిష్ పాలనలోని రాయల్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కీలక పైలట్‌గా ఉన్నారు. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా కళింగ ఎయిర్‌లైన్స్‌ను కూడా ఆయన స్థాపించారు. 15 విమానాలను కళింగ ఎయిర్‌లైన్స్ నడిపేది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రహస్యంగా ఆయన తన విమానంలో తరలించారు. 1947 ఏప్రిల్‌లో అప్పటి ఇండోనేషియా ప్రధాని సుతాన్ సజహ్రీర్‌ను రక్షించేందుకు డకోటా విమానాన్ని ఉపయోగించారు. దీనికి గాను ఇండోనేషియా ప్రభుత్వం కృతజ్ఞతగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భూమిపుత్ర'తో బీజూ పట్నాయక్‌ను రెండు సార్లు సత్కరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)