గంగా పుష్కరాలకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ !

Telugu Lo Computer
0


ఐఆర్‌సీటీసీ గంగానది పుష్కరాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఏప్రిల్ 22న మొదలయ్యే పుష్కరాలు మే 3న ముగుస్తాయి. వారణాసి, అలాహాబాద్, గంగోత్రి, హరిద్వార్, బద్రీనాథ్ లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో జరగబోయే గంగానది పుష్కరాల్లో పాల్గొనేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. గంగా పుష్కరాల యాత్ర పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 18న, ఏప్రిల్ 29న అందుబాటులో ఉంటుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో పర్యాటకుల్ని తీసుకెళ్లనుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం గంగా పుష్కరాల యాత్ర టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్‌, కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం , విజయనగరం రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు. మొత్తం 656 బెర్తులు అందుబాటులో ఉంటాయి. వీటిలో స్లీపర్ బెర్తులు 432, థర్డ్ ఏసీ బెర్తులు 180, సెకండ్ ఏసీ బెర్తులు 44 ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కవర్ అవుతాయి. ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. ప్యాకేజీ ధరలు భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్‌లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది. కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,955 కాగా, సింగిల్ షేర్ ధర రూ.15,300. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,510 కాగా, సింగిల్ షేర్ ధర రూ.24,085. ఇక కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,615 కాగా, సింగిల్ షేర్ ధర రూ.31,510. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)