భార్యపై భర్త కత్తితో దాడి !

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని దౌసా జిల్లా బైజుపాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోతిన్ గ్రామ సమీపంలో గురువారం రక్తపుమడుగులో ఓ మహిళ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను ఆస్పత్రికి తరలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. బైజుపాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ మహిళను స్థానికంగా ధిగారియా కపూర్‌కు చెందిన వినీతా దేవి (23 )గా గుర్తించారు. కాగా, వినీతాదేవిని బైక్‌పై కూర్చోబెట్టి భర్త అత్తమామల ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం. అయితే మార్గమధ్యలో ఏం జరిగిందో కానీ భర్త ఒక్కసారిగా తన భార్యపై రోడ్డుపైనే అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. కోతీన్ గ్రామ సమీపంలో వినీతపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. నిందితుడు తన వినీత శరీరంపై దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయింది. ప్రస్తుతం ఆ మహిళ జైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన తర్వాత.. వినీత భర్త అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)