పాకిస్తాన్‌లో దేశద్రోహ చట్టం రద్దు

Telugu Lo Computer
0


పాకిస్తాన్‌లోని లాహోర్‌ హైకోర్టు గురువారం వలస పాలకుల కాలం నాటి దేశ ద్రోహ చట్టాన్ని కొట్టేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడం నేరంగా భావించే ఈ చట్టం రాజ్యాంగం ప్రకారం అసమంజసంగా ఉందని తీర్పు చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ షాహిద్‌ కరీం దేశ ద్రోహానికి సంబంధించిన పాక్‌ శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124-Aను కొట్టేశారు. దేశద్రోహ చట్టం స్వతంత్ర పాకిస్తాన్‌లో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ఆయుధంగా తయారైందని ఓ పౌరుడు పిటిషన్‌ వేయడంతో కోర్టు విచారణ జరిపి ఈ నిర్ణయం వెలువరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)