శ్రీవారి భక్తులకు లడ్డుతో పాటు అగరబత్తులు ?

Telugu Lo Computer
0


తిరుపతిలో భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మరో ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆలయాల్లో సేవలకు ఉపయోగించిన పువ్వులను పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ఈ అగరబత్తులకు భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తోంది. దీంతో, ఉత్పత్తి సామర్ధ్యం రెండు రెట్లు పెంచాలని నిర్ణయించింది. తిరుమలకు కాలి నడకన వచ్చే భక్తులకు ఈ రోజు నుంచి దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేసిన పరిమళభరితమైన రూ.30.66 కోట్ల విలువైన అగరబత్తులను ఇప్పటి వరకు భక్తులకు విక్రయించారు. బెంగళూరుకు చెందిన దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సహకారంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన టీటీడీ ఈ అగరబత్తులను తయారుచేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చింది. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ తో ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ వద్దే రూ 2కోట్లతో రెండవ యూనిట్‌ ను ఛైర్మన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం రోజుకు 15 వేల అగరబత్తుల ప్యాకెట్లు తయారవుతున్నాయి. రెండవ యూనిట్‌ ప్రారంభించడం వల్ల ఈ సంఖ్య రోజుకు 30 వేల ప్యాకెట్లకు పెరుతుంది. దీనివల్ల సుమారు 200 మంది స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి భక్తులు శ్రీవారి లడ్డు ప్రసాదంతో పాటు అగరబత్తులను కూడా ప్రసాదంగా అందించడానికి టీటీడీ ముందుకొస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)