నేటి నుంచి రూ.2,500 నిరుద్యోగ భృతి

Telugu Lo Computer
0


ఏప్రిల్ 1 నుంచి నిరుద్యోగులకు రూ.2,500 చొప్పున భృతి ఇవ్వనున్నట్లు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం  ప్రకటించింది.  12వ తరగతి ఉత్తీర్ణులై, నిరుద్యోగులుగా ఉన్న వారు నెల వారీ రూ.2,500 పొందేందుకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షలకు లోపు ఉండాలని స్పష్టం చేసింది. కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉంటుందని షరత్ పెట్టింది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మున్సిపల్ కార్పొరేషన్లు, కౌన్సిల్స్ చైర్మన్లు, మాజీ చైర్మన్ల కుటుంబ సభ్యులు అర్హులు కాదని చెప్పింది. అర్హులైన యువకులు ఏడాదిలోగా ఉద్యోగం తెచ్చుకోకుంటే.. మరో ఏడాది పాటు నిరుద్యోగ భృతిని పొడిగిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో జాబ్ ఆఫర్‌ను తిరస్కరించిన వారు అలవెన్స్‌కు అర్హులు కాదని తెలిపింది. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అప్లికేషన్‌కు ఆమోదం దక్కితే.. నేరుగా అకౌంట్లలో డబ్బులు పడుతాయని వివరించింది. ఇటీవల ప్రవేశపెట్టిన చత్తీస్‌గఢ్ రాష్ట్ర బడ్జెట్‌లో.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు సీఎం భూపేశ్ బాఘెల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)