మంత్రిని ప్రశ్నించినందుకు జర్నలిస్టు అరెస్టు

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ మంత్రి గులాబ్ దేవి గ్రామసభ జరుపుతుండగా వేదిక ఎక్కిన స్థానిక విలేకరి సంజయ్ రాణా గత అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి అభ్యర్థినిగా ఆమె గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేశాడు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించడంతోపాటు పాత వాగ్దానాలను కూడా అతను గుర్తు చేశాడు. గ్రామానికి రోడ్దు వేస్తామని, ఆలయానికి ప్రహరీ గోడ నిర్మిస్తామని ఆమె వాగ్దానం చేశారని అతను గుర్తు చేశాడు. వేదికపై మంత్రితోపాటు ఉన్న ఇతర నాయకులు విలేకరి సంజయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మంత్రి మాట్లాడుతూ ఈ విషయాలు చర్చించేందుకు ఇది సందర్భం కాదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు కూడా సంజయ్‌కు అండగా నిలబడ్డారు. మంత్రిని దుర్భాషలాడాడని, సభలో గొడవ చేశాడంటూ బిజెపికి చెందిన ఒక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ రాణాను అరెస్టు చేశారు. రెండు రోజుల పాటు అతడిని స్టేషన్‌లోనే వుంచారు. పోలీసు స్టేషన్ వద్ద సంజయ్‌ను బిబిసి విలేకరి పలకరించగా వాగ్దానాలు గుర్తుచేసినందుకు మంత్రి ఆదేశాల మేరకే తనను అరెస్టు చేసినట్లు అతను తెలిపాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)