జెలెన్‌స్కీ ప్రసంగానికి నో చెప్పిన ఆస్కార్ అకాడమీ

Telugu Lo Computer
0


ఆస్కార్‌ వేదికపై వర్చువల్‌ ప్రసంగానికి ఉవ్విళ్ళూరుతోన్న జెలెన్‌స్కీకి ఆస్కార్‌ నిర్వాహక సంఘం నో చెప్పింది. ఆస్కార్‌ అకాడమీ జెలెన్‌స్కీ అభ్యర్థనను తిరస్కరించడం ఇది రెండో సారి. అవార్డుల ప్రదానోత్సవ సమయంలో వర్చువల్‌గా ప్రసంగించాలన్న ఆయన అభ్యర్థనను ఆస్కార్‌ తోసిపుచ్చింది. జెలెన్‌స్కీకి ఆస్కార్‌ వేదిక కొత్తకాదు. ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి వచ్చిన జెలెన్‌స్కీ గతంలో అనేక సార్లు ఆస్కార్‌ అవార్డులు కార్యక్రమంలో పాల్గొనడమే కాదు.. గతేడాది జరిగిన కేన్స్, వేనిస్ ఫిలిం ఫెస్టివల్స్‭లో వర్చువల్ ప్రసంగాలు చేశారు జెలెన్‭స్కీ. ఇటీవల జరిగిన బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో సైతం వర్చువల్‌గా ప్రసంగం చేసిన జెలెన్‌స్కీకి ఇప్పుడు మాత్రం అవకాశం దక్కలేదు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గోనే వారి జాబితాలో జెలెన్‭స్కీని చేర్చాలన్న డబ్ల్యూఎంఈ పవర్ ఏజెంట్ మైక్ సింప్సన్ అభ్యర్థనను తిరస్కరించింది ఆస్కార్‌ టీం. గతేడాది కూడా జెలెన్‭స్కీ ప్రసంగం గురించి ప్రతిపాదనను అకాడమీ వ్యతిరేకించింది. గత ఏడాది సైతం రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా జెలెన్‌స్కీ వర్చువల్‌ ఉపన్యాసం రద్దయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)