మంత్రి పదవి కన్నా ప్రజాసేవే ముఖ్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజు తనకు పదవి ఉన్నా లేకున్నా బాధపడనని అన్నారు. మంత్రి పదవి కన్నా తనకు ప్రజాసేవే ముఖ్యమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం సీఎం జగన్‌తో మంత్రి అప్పలరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా దృష్టిలో వైకాపా ఎమ్మెల్యేలందరూ మంత్రులే. బీసీల నుంచి వచ్చిన నాకు జగన్‌ మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న సమాచారం లేదు'' అని అప్పలరాజు వివరించారు. ఏపీ కేబినెట్‌లో మార్పులు జరగబోతున్నాయంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులను తప్పించి, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజు సీఎం జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)