అంబుజా సిమెంట్‍లో దానీ వాటా విక్రయం ?

Telugu Lo Computer
0


అంబుజా సిమెంట్‌లో సుమారు $450 మిలియన్ల విలువైన వాటాను విక్రయించాలని యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక మార్చి 10న తెలిపింది. సిమెంట్ వ్యాపారంలో నాలుగు నుంచి ఐదు శాతం వాటాలను విక్రయించాలని అదానీ మార్చి 9న ప్రపంచ రుణదాతలకు అధికారిక అభ్యర్థన చేసినట్లు తెలిసింది. అదానీ కుటుంబానికి అంబుజా సిమెంట్‌లో 63 శాతం వాటా ఉంది. అదానీ ఇది గత సంవత్సరం $10.5 బిలియన్లకు అంబుజా సిమెంట్ ను కొనుగోలు చేసింది. అంబుజా సిమెంట్స్‌కు ఛైర్మన్‌గా గౌతమ్‌ అదానీ బాధ్యతలు చేపట్టారు. ఆయన కుమారుడు కరణ్‌ ఏసీసీ ఛైర్మన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా ఉన్నారు. అంబుజా సిమెంట్స్‌లోనూ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా కరణ్‌ వ్యవహారిస్తున్నారు. అంబుజా సిమెంట్ షేర్లు మార్చి 10న మార్కెట్‌లో దాదాపు రూ. 378 వద్ద ముగిశాయి. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 1.6 శాతం తక్కువ. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, కంపెనీలో ఐదు శాతం వాటా విలువ సుమారు $465 మిలియన్లు. వచ్చిన డబ్బుతో రుణాలు చెల్లించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్ ఇప్పటికే కొన్ని అప్పులను ముందస్తుంగా చెల్లించింది. కాగా హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై విచారణ చేయడానికి సుప్రీం కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)