రాష్ట్రపతి నిలయానికి ప్రత్యేక బస్సులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు సందర్శకులకు నేటి నుంచి అనుమతి ఇవ్వడంతో ఆర్‌టి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్. వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టపతి నిలయం సందర్శనకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఇవ్వడంతో సందర్శకుల సౌకర్యార్దం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సికింద్రాబాద్ నుంచి బాలాజీనగర్, సీఆర్‌పిఎఫ్,ఘటకేసర్‌కు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం మీదుగా బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు రూట్ నెం 24 బి, సికంద్రాబాద్ నుంచి బాలాజీ నగర్, అదే విధంగా హకీంపేట డిపో నుంచి రూట్ 211 ఎమ్ సికింద్రాబాద్ నుంచి సిఆర్‌పిఎఫ్, 24 బి / 281 సికింద్రాబాద్ ఘటకేసర్‌కు ప్రతి రోజు 18 టిప్పులతో ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సురక్షితమైన ,సుఖవంతమైన ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించి సంస్థ అభివృద్దికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)