వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకే !

Telugu Lo Computer
0


రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం యువతకే టికెట్లు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో తిరుగుతూ కష్టపడిన వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నది ఎన్నికల ఏడాదే.. త్వరగా మేనిఫెస్టో రూపొందిస్తే.. ప్రజల్లోకి వెళ్లడానికి సులువవుతుందని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తోన్న కేంద్రం, ప్రధానమంత్రికి అభినందనలు తెలుపుతూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది వీటితో పాటు ఎన్నికల నేపథ్యంలో మరిన్ని కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు తెలుగు దేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు . రేపటి నుంచి మే 28 వరకు వివిధ ప్రదేశాల్లో వంద సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా పొత్తులపై నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని సమాచారం. ఎన్నికల టైంలో మాత్రమే పొత్తుల విషయం మాట్లాడుదామని.. అప్పటి వరకు నాయకులంతా నిత్యం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. పొలిట్ బ్యూరో సమావేశం తరువాత టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారో జగన్ చెప్పాలని అచ్చెన్నాయుడు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 కలిపి పొలిట్ బ్యూరోలో మెత్తం 17 అంశాలపై చర్చించామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)