పుదుచ్చేరిలో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ

Telugu Lo Computer
0


బీపీఎల్‌ వర్గాల ప్రజలకు నెలవారీ రూ.300 ఎల్‌పీజీ సబ్సిడీని ప్రకటిస్తున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వం తెలిపింది. 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌లో ముఖ్యమంత్రి ఎన్ రంగసామి ఈ మేరకు ప్రకటించారు. గ్యాస్‌ సిలింబర్‌ సబ్సిడీపై ఆయన మాట్లాడుతూ అన్ని కుటుంబాలకు నెలకు ఒక సిలిండర్‌కు రూ.300 సబ్సిడీని అందించే పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రూ.126 కోట్లు కేటాయించిందని తెలిపారు. 11,600 కోట్ల పన్ను రహిత బడ్జెట్‌ను ఆయన సమర్పించారు. ఎల్‌పీజీ సబ్సిడీ కార్యక్రమం రేషన్ కార్డులను కలిగి ఉన్న అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఎల్​పీజీ సిలిండర్​ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరి 1న సిలిండర్​ ధరలను పెంచగా, ఇటీవల మార్చిలోనూ మరో సారి ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్​పీజీ సిలిండర్​ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. ప్రతి నెల 1వ తేదీన ఎల్​పీజీ సిలిండర్​ ధరలను సవరిస్తుంటారు. దేశంలోని ప్రతి ఇంటికి ఏడాది చొప్పున 12 సిలిండర్​లు (14.2కేజీల) సబ్సిడీ రేట్లతో అందుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)