27న తమిళనాడులో ప్రధాని పర్యటన - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 15 March 2023

27న తమిళనాడులో ప్రధాని పర్యటన


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక్కరోజు పర్యటన కోసం ఈ నెల 27వ తేదీన తమిళనాడు రానున్నారు. ఆ రోజు ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా మదురై రానున్న ప్రధాని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామేశ్వరానికి చేరుకుంటారు. అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. మళ్లీ హెలికాప్టర్‌లో మదురై చేరుకుని, ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.2,400 కోట్లతో 2.36 లక్షల చ.మీ విస్తీర్ణంలో టెర్మినల్‌ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 2.20 కోట్ల నుంచి 3.50 కోట్ల వరకు పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేది జరుగనున్న ఈ టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తదితరులు కూడా పాల్గొననున్నారు. 

No comments:

Post a Comment