కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు 17% వేతనం పెంపు

Telugu Lo Computer
0


కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం బసవరాజ బొమ్మై ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన సీఎం బసవరాజ బొమ్మై ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గత బుధవారం సమ్మెకు పిలుపునిచ్చింది. అనంతం నిరవధిక సమ్మె చేపట్టారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ కమిటీని వేసింది. భారతదేశం అంతటా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన మార్పులను అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో కమిటీ రిపోర్టు అందటంతో మార్చి1న  అర్ధరాత్రి వరకు సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ అధికారులు, ఉద్యోగుల సంఘం ప్రముఖులతో పలు విడతలుగా చర్చలు జరిపారు. దీంతో ఉద్యోగుల డిమాండ్లలో ఒకటైన ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలులో భాగంగా మూల వేతనంలో 17 శాతం పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఉద్యోగులు బేసిక్ జీతంలో 40 శాతం పెంచాలని, ఎన్పీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తమ డిమాండ్స్ నెరవేర్చేవరకు సమ్మె విరమించేదిలేదని తేల్చి చెప్పారు. ఈక్రమంలో కమిటీతో చర్చలు జరిపిన సీఎం 17 శాతం ఉద్యోగ వేతనం పెంచుతున్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుసీఎస్ షడక్షరి ఆర్థిక శాఖ అధికారులను కలిసి 17% పెంపు ప్రతిపాదన కాపీని అందజేశారు. ఈ సమావేశం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)