ఢాకాలో భారీ పేలుడు : 11 మంది మృతి

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని ఒక భవనంలో జరిగిన పేలుడులో 11 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు. మంగళవారం ఢాకాలోని రద్దీగా ఉండే గులిస్తాన్‌ ఏరియాలోని బహుళ అంతస్తుల భవనంలో ఈ పేలుడు సంభవించిందని స్థానిక అగ్నిమాపక సేవా అధికారి ఒకరు తెలిపారు. పేలుడుకు కారణం తెలియదని, సహాయక చర్యలు కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. పేలుడు సంభవించిన తర్వాత 11 అగ్నిమాపక యూనిట్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. ఇది సాయంత్రం 4:50 గంటలకు సంభవించింది,.క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసు అవుట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ బచ్చు మియా తెలిపారు.వీరంతా ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. పేలుడు ధాటికి రోడ్డుకు ఎదురుగా నిలబడి ఉన్న బస్సు కూడా ధ్వంసమైంది.చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారని బచ్చు మియా చెప్పారు. అయితే భవనంలో ఎటువంటి మంటలు చెలరేగలేదని అగ్నిమాపక సేవల ప్రతినిధి తెలిపారు. ఈ భవనం విషయానికి వస్తే అత్యంత రద్దీ ప్రాంతమైన సిద్దిఖ్‌ బజార్‌లో ఉంది. బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. శానిటేషన్‌ మెటిరియల్‌ విక్రయించే స్టోర్‌లో ఈ పేలుళ్లు జరిగాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా ముస్లింల ఉండే శిబిరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వేలాది మంది శరణార్థులు నిరాశ్రయులయ్యారు.ఆదివారం కాక్స్ బజార్ జిల్లాలోని బలుఖాలీ క్యాంపులో జరిగిన ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక సేవ అధికారి ఎమ్దాదుల్ హక్ తెలిపారు.కాక్స్ బజార్‌లోని క్యాంప్ 11 వద్ద మంటలు చెలరేగాయి. కాక్స్ బజార్ వద్ద అదనపు పోలీసు సూపరింటెండెంట్ రఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ, ప్రస్తుతం మాకు నష్టంపై అంచనా లేదు, కానీ ప్రాణనష్టం గురించి ఎటువంటి నివేదికలు లేవు అని రాయిటర్స్‌తో అన్నారు.మంటలు అదుపులో ఉన్నాయని, అగ్నిమాపక, పోలీసు మరియు శరణార్థుల సహాయ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)