చదువుకోవడానికే డబ్బులుండేవి కావు, ఇక చిరుతిండ్లు.....! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 11 February 2023

చదువుకోవడానికే డబ్బులుండేవి కావు, ఇక చిరుతిండ్లు.....!


ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో రమా దేవి మహిళా విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్వేగానికి లోనయ్యారు. తన ప్రసంగంలో కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.  చదువుకోవడానికే డబ్బులుండేవి కావు, ఇక చిరుతిండ్లు కొనుక్కోవడానికి డబ్బులెక్కడివి. అందుకే కాలేజీ క్యాంటిన్ వైపు కన్నెత్తి కూడా చూసే వాళ్లం కాదు.. "ఒక వీధి వ్యాపారి నిమ్మకాయలు, మిరపకాయలతో 25 పైసలకు మసాలా వేరుశెనగలను అమ్మేవాడు. అవే కొనుక్కుని ఎంతో ఇష్టంగా తినేవాళ్లం. కళాశాల రోజులలో జ్ఞాపకాలు ఇప్పటికీ నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. "ఈ సంస్థ నా జీవితానికి ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది. ప్రతి విషయంలోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయులు ఇప్పటికీ గుర్తున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలని నేను విద్యార్థులను కోరుతున్నాను. వివిధ రంగాల్లో రాణించి సమాజానికి ఎనలేని సేవలందించిన మహిళలు చాలా మంది ఉన్నారు' అలాంటి వారిని రోల్ మోడల్స్‌గా తీసుకుని ముందుకు సాగాలి అని ముర్ము అన్నారు. సామాజిక అసమతుల్యత, లింగ వివక్ష గురించి ముర్ము మాట్లాడుతూ, "మా గ్రామంలోని ప్రజలు నా చదువుల ఉపయోగం గురించి నన్ను అడిగేవారు. ఆడపిల్ల ఎంత చదువుకున్న చివరికి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లవలసిందే. ఇక అప్పుడు చదువుకుని ఉపయోగం ఏం ఉందని అనేవారు. అయితే అమ్మాయిలు శారీరకంగా అబ్బాయిల కంటే భిన్నంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరు ఏమనుకున్నా మీరు అనుకున్నది సాధించాలి. మీ కాళ్ల మీద మీరు నిలబడాలి. ఆర్థిక స్వాతంత్ర్యం స్త్రీకి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దని  విద్యార్థులకు ముర్ము హితవు పలికారు. 


No comments:

Post a Comment