ఒకరితో ఒకరు కలిసి సమిష్టిగా పనిచేయాలి

Telugu Lo Computer
0


చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు ఆదివారంతో ముగియనున్నాయి. 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు అన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని తీర్మానం చేశాయి. ఇదిలా ఉంటే చివరి రోజు రాహుల్ గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించనున్నారు. ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలను కొత్త తరాలకు తెలియజేయాలని కోరారు. ఒకరితో ఒకరు కలిసి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కేంద్రం ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తోందని అన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను అధిగమించి, సంఘీభావంతో ప్రేమపూర్వక రాజకీయాలు చేద్దాం అని కార్యకర్తలను కోరారు. ప్లీనరీ వేదికగా పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందని అన్నారు. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, కేవలం కొంతమంది వ్యాపారులకు కొమ్ముకాస్తూ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని ఆరోపించారు సోనియా. మైనారీటు, దళితులు, గిరిజనులు, మహిళలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)