తెల్ల జుట్టు - కారణాలు !

Telugu Lo Computer
0


జన్యుపరమైన, హార్మోన్లలో అసమతుల్యత, పోషకాలు కారణంగా  తెల్ల జుట్టు సమస్య వస్తుంది. జుట్టుకు కెమికల్స్ వాడడం, పొల్యూషన్ వల్ల జుట్టు నిర్జీవంగా మారిపోవడం ఇలా కూడా తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. అలాగే స్మోకింగ్ చేసేవారిలో కూడా ఈ తెల్ల జుట్టు సమస్య వస్తూ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోయినా జుట్టు ఆరోగ్యానికి నష్టం కలిగిస్తూ ఉంటుంది. పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, పాల ఉత్పత్తులు, మాంసం లాంటి ప్రధానమైన ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడి, నిద్రలేమి ,ఆందోళన ఆకలి మందగించడం లాంటి సమస్యలకు దూరంగా ఉండాలి.  పొగ తాగే వారిలో జుట్టు, చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరం. సిగరెట్లలో ఉండే ట్యాక్సీన్ వెంట్రుకల కుదురులను చిట్లిపోయేలా చేస్తాయి. దీంతో తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది. కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడడం వలన కూడా జుట్టు తెల్లబడే సమస్య అధికమవుతూ ఉంటుంది. హెయిర్ ప్రోడక్ట్ లో ఉండే సెల్ఫట్ కొన్ని ఉపయోగాలు చేకూర్చినప్పటికీ వీటివలన జుట్టు తెల్లబారిపోతుంది. హెయిర్ స్టైల్ వలన వెంట్రుకలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్లు తరచుగా చేసుకోవడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండి అని నాచురల్ కొంకుడుకాయలు, షికాయా ఉసిరి పొడితో జుట్టు కు అప్లై చేసుకుంటూ ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు..

Post a Comment

0Comments

Post a Comment (0)