కర్ణాటక ఆర్టీసీ బస్సు చోరీ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 21 February 2023

కర్ణాటక ఆర్టీసీ బస్సు చోరీ !


కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది. కలబురగి జిల్లాలోని చించోలి బస్టాండ్ లో ఇవాళ పార్క్ చేసిన ఉన్న ఆర్టీసీ బస్సును దొంగలు నడుపుకుంటూ తీసుకెళ్లి పోయాడు. ఆ దొంగలు బస్సును తెలంగాణ బార్డర్ దాటించి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆ బస్సు నంబరు KA 38 F 971 అని అధికారులు తెలిపారు. ఆ బస్సు బీదర్ జిల్లాలోని కేకేఆర్టీసీ డిపోనంబరు 2కు చెందిందని అన్నారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. దీనిపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటివరకు బస్సును స్వాధీనం చేసుకోలేకపోయారు. ఏదైనా నిర్మానుష్య ప్రాంతంలో దొంగలు ఆ బస్సును వదిలి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన బస్సు ఎక్కడుందో తెలుసుకోవడానికి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment