రోహిత్ శర్మ సెంచరీ

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని నాగ్‌పూర్, విదర్భ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు 66 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్ శర్మ 176 బంతుల్లో 103 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్లు విఫలమైన మొక్కవోని దీక్షతో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేసి లయన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. ప్రసుతం భారత జట్టు 12 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(103), రవీంద్ర జడేజా (12) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసి ఆలౌటైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)