చదవుకున్న కళాశాలలోనే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట

Telugu Lo Computer
0


కేరళలో ప్రత్యేక వివాహం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూత్ ఫెస్టివల్ సందర్భంగా ఓ ప్రేమ జంట వినూత్నంగా పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. ఎర్నాకుళంలోని మట్టంచెరి ప్రాంతానికి చెందిన కేకే నదీమ్​, పనంగాడ్‌కుచెందిన సీఆర్​ కృపా అనే యువతీ యువకులు మహారాజా కాలేజ్‌లో డిగ్రీ చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిరుగురించింది. చదువులు పూర్తి అయిన తరువాత కూడా వీరి ప్రేమ కొనసాగింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. చివరికి నదీమ్‌ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ.. కృప తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి ప్రేమకు వేదికైన కళాశాలలోనే ఒక్కటవ్వాలనుకున్నారు. అదే సమయంలో కాలేజ్‌లో యూత్‌ ఫెస్టివల్‌ జరుగుతుండటంతో అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 8వ తేదీన తమ పెళ్లిని రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం కాళశాలకు తిరిగి వచ్చారు. వేలాది మంది విద్యార్థుల సమక్షంలో కళాశాల సెంటర్‌ సర్కిల్‌లో ఉన్న దేవత విగ్రహం ముందు ఇద్దరూ మార్చుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. నూతన జంటకు స్నేహితులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా నదీమ్‌ ప్రేవేటు కంపెనీ పనిచేస్తుండగా.. కృప లా చదువుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)