వైరల్ అవుతున్న పెండ్లి పత్రిక ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 24 February 2023

వైరల్ అవుతున్న పెండ్లి పత్రిక !


గుజరాత్ కు చెందిన ఓ వివాహ ఆహ్వాన పత్రిక ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. సాధారణంగా పెళ్లి పంక్షన్లలో బంధువులు మందు తాగి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతుండటం చూశాం. అయితే కొన్ని సందర్భాలలో స్వయంగా పెళ్లి కొడుకు తాగి రావడం, పెళ్లి ఆగిపోయిన ఘటనలు కూడా చూశాం. అయితే గుజరాత్ లోని రాజ్‌ కోట్ లోని హడలా గ్రామానికి చెందిన మన్సుక్ సీతాపర కూతురు వివాహం గురువారం జరిగింది. అయితే వివాహ ఆహ్వానపత్రికలో మందు తాగి ఉంటే పెళ్లికి రావద్దు అని ప్రింట్ చేయించారు. తాగి తూలే అతిథులు, గొడవలకు దూరంగా పెళ్లి కార్యక్రమం ఉంచాలనే ఆలోచనతో ఇలా చేసినట్లు అర్థమవుతోంది. ఈ వివాహ పత్రిక గురించి సీతాపర కుటుంబ సభ్యుడొకరు మాట్లాడుతూ "ఇటీవల మా గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో ఇద్దరు మందు తాగి వచ్చిన అతిధులు గొడవపడ్డారు. మా కుటుంబ విహహం విషయంలో అలాంటి తలనొప్పులు ఉండకూడదనే ఇలా చేశాం" అని తెలిపారు. ఈ రకమైన వివాహ ఆహ్వానం రెండు ప్రయోజనాలను అందించిందన్నారు. మొదటిది మేము పోలీసుల దాడులకు భయపడాల్సిన అవసరం లేదు, రెండవది ఆహ్వానం అతిథులను మందు తాగ రావద్దు అని స్పష్టంగా అడుగుతుంది కాబట్టి అవిధేయత చూపిన వారిని వేదిక నుండి బయటకు వెళ్లమని మేము కోరగలిగేలా రెండు ప్రయోజనాలు ఇందులో ఉన్నట్లు తెలినారు. అన్నింటికన్నా ముందు పెళ్లి కార్యక్రమం హ్యాపీగా జరగడమే కావాలి కాబట్టి అతిథులను ఇలా ఆహ్వానించినట్లు తెలిపారు. తమ లాగే భవిష్యత్తులో చాలా కుటుంబాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గేనప్పుడు ఆల్కహాలు లేదా మద్యం సేవించి రావద్దు అని కోరుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

No comments:

Post a Comment