రెండో టెస్టులో భారత్ ఘన విజయం

Telugu Lo Computer
0


ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సిరీస్ లో భారత్ 2-0 అధిక్యంలో ఉంది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ (01), రోహిత్ శర్మ(31), విరాట్ కోహ్లీ(20), శ్రేయస్ అయ్యర్(12), పుజారా(31)నాటౌట్, శ్రీకర్ భరత్(23) నాటౌట్ పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయాన్ రెండు వికెట్లు, మర్ఫీ ఒక వికెట్ తీశాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీయడంతో పాటు 26 పరుగులు చేసిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.


Post a Comment

0Comments

Post a Comment (0)