ఒకేరోజు దేశవ్యాప్తంగా 440 రైళ్లు రద్దు !

Telugu Lo Computer
0


వాతావరణ మార్పు ప్రభావం, సాంకేతిక కారణాలు, రైలు ప్రమాదాలు కారణంగా ఇంత పెద్ద మొత్తంలో రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఒకేరోజు దేశవ్యాప్తంగా పలు రూట్లలో 440 రైళ్లను రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు, కొన్నింటి ఆలస్యంగా నడిపినట్లు, కొన్ని రైళ్లను కుదించినట్లు పేర్కొంది ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్‭ సైట్‭లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌరా, న్యూఢిల్లీ, భటిండా, ఆజంగంజ్, సికింద్రాబాద్, పటాన్ కోట్, భోపాల్, లక్నో, ప్రయాగరాజ్, హోషియార్ పూర్, జలంధర్, రాంనగర్, కోయంబత్తూర్, బిలాస్ పూర్, అహ్మదాబాద్ సెక్షన్లలోని 440 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే పేర్కొంది. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రైలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)