అంజలీ కుటుంబానికి షారూఖ్ ఖాన్ సాయం ? - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 7 January 2023

అంజలీ కుటుంబానికి షారూఖ్ ఖాన్ సాయం ?


ఢిల్లీలో 20 ఏళ్ల అంజలిని కారుతో ఢీకొట్టి. 12 కిమీ. వరకు లాక్కెళ్లి పడేసిన ఉదంతం అందిరికీ తెలిసిందే. ఆమె మరణంతో ఆమె కుటుంబం దిక్కులేనిదయింది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో అంజలి పనిచేస్తుండేది. కుటుంబానికి ఆమె పెద్ద దిక్కు. అంజలి కుటుంబానికి ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు చెందిన ఎన్జీవో సంస్థ సాయం అందించింది. కష్ట కాలం నుంచి ఆ కుటుంబం బయటపడేందుకు కావలసినంత ఇచ్చారని తెలిసిందే తప్ప, ఎంత అన్నది తెలియలేదు. షారూఖ్ ఖాన్‌కు చెందిన 'మీర్ ఫౌండేషన్' ఈ సాయం అందించిందని సమాచారం. ముఖ్యంగా అంజలి తల్లి ఆరోగ్య చికిత్సకు, ఆమె తోడబుట్టిన వారికి ఉపశమనం కలిగించేలా ఆ సాయం ఉందని తెలిసింది. తన తండ్రి మీర్ తాజ్ ముహమ్మద్ ఖాన్ పేరిట షారూఖ్ ఖాన్ ఈ 'మీర్ ఫౌండేషన్' ఏర్పాటు చేశారు. మీర్ ఫౌండేషన్ అనేక మందిని వేర్వేరు పరిస్థితుల్లో, అవసరాల్లో ఆదుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఏ దిక్కులేని మహిళలు, పిల్లలకు ఈ సాయం అందిస్తోంది.

No comments:

Post a Comment