తక్కువ ధరకు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి

Telugu Lo Computer
0


రష్యా నుంచి భారత్, చైనాకు భారీగా చమురు దిగుమతి అవుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన ముడి చమురును చైనా, భారత్ కు తక్కువ ధరకు విక్రయిస్తుంది. డిసెంబర్ లో యూపప్ దేశాలు కూడా రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని నిలిపివేశాయి. దీంతో రష్యా మరింత ఎక్కువగా ముడి చమురును తక్కువ ధరకు భారత్, చైనాకు సరఫరా చేస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా ఉత్పత్తి చేసిన ముడి చమురును చైనా, భారత్ కు ఎగుమతి చేస్తోంది. సముద్రం ద్వారా ముడి చమురు దిగుమతికి ఖర్చు పెరగడంతో రష్యా చమురు ధరను మరింత తగ్గించి భారత్, చైనాకు సరఫరా చేస్తోందని సింగపూర్‌కు చెందిన ఒక వ్యాపారి చెప్పారు. నవంబర్‌లో రికార్డు స్థాయిలో 6.67 మిలియన్ బ్యారెల్స్, డిసెంబర్‌లో 4.1 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. రష్యా నుంచి భారత్ కు ముడి చమురు ఎగుమతులు క్రమంగా పెరిగాయని రిఫినిటివ్ డేటా తెలిపింది. యూరప్, మెడిటరేనియన్, సూయజ్ కెనాల్ మీదుగా ప్రయాణించిన 900,000-బ్యారెల్ కార్గో ఆన్‌బోర్డ్ ట్యాంకర్ బేర్ ఆల్కోర్... రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ పెట్రోల్ ను ఎగుమతి చేశారు. బేర్ ఆర్కోర్ కు డిసెంబర్ 27న కేరళలోని కొచ్చిన్ పోర్ట్ కు వచ్చింది. రష్యాకు ఇప్పుడు భారత్, చైనాలు తమ ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. మర్మాన్స్క్ పోర్ట్‌లో ఆర్కిటిక్ ముడి చమురును లోడ్ చేసిన కనీసం మూడు చమురు ట్యాంకర్లు ఇప్పుడు చైనాకు వెళుతున్నాయని రిఫినిటివ్ డేటా చూపించింది. ట్యాంకర్లలో ఒకటైన నికోలాయ్ జుయేవ్, దాదాపు 780,000 బ్యారెళ్ల క్రూడ్‌ను తీసుకువెళుతుంది. జనవరి 18న ఇది చైనా చేరుకుంటుందని అంచనా. మరో రెండు ట్యాంకర్లు - NS బ్రావో మరియు గ్లాడియేటర్ - ఒక్కొక్కటి 900,000 బ్యారెల్స్ ముడి చమురును మోసుకెళ్ళేవి ఇవి ఫిబ్రవరి 3, 15 తేదీలలో చైనా తూర్పు నగరమైన కింగ్‌డావోకు చేరుకుంటాయని డేటా పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)