ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని పుణేలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు భీమా నదిలో శవమై కనిపించారు. మృతులు మోహన్‌ పవార్‌ (45), అతని భార్య సంగీతా మోహన్‌ (40), అతని కుమార్తె రాణి ఫుల్‌వేర్‌ (24), అల్లుడు శ్యామ్‌ ఫుల్‌వేర్‌ (28) వారి ముగ్గురు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన జనవరి 18 నుంచి 24 మధ్య పూణేలో దువాండ్‌ తహసిల్‌లోని పర్గావ్‌ వంతెన వద్ద జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు మృతుడు మోహాన వార్‌ బంధువులైన అశోక్‌ కళ్యాణ్‌ పవార్‌, శ్యామ్‌ కల్యాణ్‌ పవార్‌, శంకర్‌ కల్యాణ్‌ పవార్‌, ప్రకాశ్‌ కల్యాణ్‌ పవార్‌, కాంతాబాయి సర్జేరావ్‌ జాదవ్‌ అనే ఐదుగురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో మృతులంతా హత్యకు గురైనట్లు తేలిందిని చెప్పారు పోలీసులు. ఐతే సదరు నిందితుడు అశోక్‌ పవార్‌ కుమారుడు ధనుంజయ్‌ పవార్‌ కొన్న నెలలు క్రితం ప్రమాదంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన కేసు పుణె నగరంలో నమోదైనట్లు చెప్పారు. ధనుంజయ్‌ మరణానికి మోహన్‌ కారణమని దర్యాప్తులో తేలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో వారందర్నీ కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్‌మార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు నివేదిక పేర్కొందని చెప్పారు. మృతులంతా ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)