విద్యుదాఘాతానికి ఏనుగు బలి

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో ఏనుగు మృతదేహం లభ్యమైంది. నారాయణ్ సింగ్ రిజర్వాయర్ కోదార్ ఎడమ గట్టు కాలువలో విద్యుదాఘాతానికి గురై మగ ఏనుగు చనిపోయింది. ఈ ఘటన జనవరి 7వ తేదీ రాత్రి జరిగింది. పెట్రోలింగ్ బృందానికి సమాచారం అందగానే వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు అటవీ సిబ్బంది అక్కడు చేరుకుని పరిశీలించారు. ఆ ప్రాంతంలో అడవి జంతువులను వేటాడే ముఠా చురుకుగా ఉంటుంది. కోడేరు రిజర్వాయర్‌ సమీపంలోని 11కేవీ విద్యుత్‌ లైన్‌కు హుకింగ్‌ ద్వారా వైర్లు వేట గాళ్లు వేశారు. రెండు ఏనుగులు గరియాబంద్ జిల్లా నుంచి మహాసముంద్ మీదుగా సిర్పూర్ ప్రాంతానికి వెళుతుండగా.. వారు వేసిన లైవ్ వైర్‌ ఏనుగు దంతానికి తగిలింది. దీంతో మగ ఏనుగు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రాంతంలో ఏనుగుల మరణాల సంఘటనలు పెరుగుతున్నాయి. గత మూడునెలల్లో ఈ విధంగా ఏనుగులు చనిపోయిన ఘటన రెండోది. గతంలో నవంబర్ నెలలో పిథోరా ప్రాంతంలోని బార్ నవాపర అభయారణ్యంలో ఇదే విధంగా విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందింది. మరోవైపు, బాగిచా అటవీ రేంజ్‌లోని కుర్‌దేగ్ గ్రామంలోని అడవిలో విద్యుదాఘాతంతో పెద్ద ఏనుగు మృతి చెందింది. తీగ తగిలి ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతదేహాన్ని పొలంలో స్వాధీనం చేసుకుసి పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు నిర్వహించినట్లు అటవీశాఖ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)