ఆప్ఘనిస్తాన్‌లో ఆటవిక శిక్షలు అమలు !

Telugu Lo Computer
0


ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం మంగళవారం నాడు వివిధ నేరాలకు పాల్పడిన వారికి కందహార్‌లోని ఒక ఫుట్‌బాల్‌ స్టేడియంలో ప్రజల సమక్షంలో శిక్షలను అమలు చేసింది. దొంగతనాలకు పాల్పడిన తొమ్మిది మంది నిందితులకు బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష అమలు చేయడంతో పాటు మరో నలుగురి చేతులు నరికేశారు. గవర్నర్‌ కార్యాలయం అధికార ప్రతినిధి హజీ జెయిద్‌ దొంగలకు విధించిన శిక్షల గురించి వివరించారు. వివిధ నేరాలకు గాను ఒక్కొక్కరికి 35 నుంచి 39 కొరడా దెబ్బల శిక్ష విధించామని చెప్పినట్లు సన్‌పత్రిక వెల్లడించింది. ఈ బహిరంగ శిక్షలు అమలు చేసేటప్పుడు తాలిబన్‌ అధికారులు, మత గురువులు, పెద్దలు, స్థానిక ప్రజల సమక్షంలో ఈ శిక్షలు అమలు చేయడం జరిగింది. స్టేడియంలోని గడ్డిపై తొమ్మిది నిందితులు శిక్ష కోసం ఎదురుచూస్తున్న చిత్రాలను స్టేడియంకు వచ్చిన ప్రేక్షకులకు పంచిపెట్టారు. జర్నలిస్టు తాజుద్దీన సౌరుష్‌ స్టేడియంలోని చిత్రాలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆప్ఘనిస్తాన్‌లోలో చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. 1990 నాటి తాలిబన్‌ ప్రభుత్వం విధించిన బహిరంగ శిక్షలు తరిగి పున: ప్రారంభమయ్యాయన్నారు. గత డిసెంబర్‌లో తాలిబన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక వ్యక్తికి బహిరంగంగా ఉరిశిక్షను అమలు చేశారు. ఓ వ్యక్తిని హత్య చేసినందుకు తాలిబన్లు నిందితుడికి బహిరంగ శిక్ష అమలు చేశారు. బాధితుడి తండ్రి రైఫిల్‌తో నిందితుడుని కాల్చి చంపాడు. వందలాది మంది ప్రజల సమక్షంలో.. తాలిబన్‌ అధికారులు చూస్తుండగా బాధితుడి తండ్రి కాల్చి చంపాడు. తాలిబన్లు మహిళలపై నిర్బంధాన్ని స్వల్పంగా సడలించారు. మహిళలు హెల్త్‌ కేర్‌ రంగంలో పనిచేయడానికి అనుమతించడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)