హోమోసెక్సువాలిటీ నేరం కాదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 25 January 2023

హోమోసెక్సువాలిటీ నేరం కాదు !


హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణిస్తున్న చట్టాలపై  పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడు తన పిల్లలు ఎలా ఉన్నా ప్రేమిస్తాడని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.  LGBTQ కమ్యూనిటీని చర్చికి స్వాగతించాలని కేథలిక్ బిషప్‌లకు పిలుపునిచ్చారు. హోమోసెక్సువల్‌గా ఉండటం నేరం కాదన్నారు. ఓ వార్తా సంస్థకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోమోసెక్సువాలిటీని నేరంగా పరిగణించే చట్టాలను, అదేవిధంగా LGBTQ కమ్యూనిటీ పట్ల వివక్ష ప్రదర్శించే చట్టాలను ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కేథలిక్ బిషప్‌లు సమర్థిస్తున్న విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారు. హోమోసెక్సువాలిటీ అనేది పాపం అని, నేరం కాదని చెప్పారు. అందరి గౌరవాన్ని గుర్తించే విధంగా బిషప్‌లు మారవలసి ఉందని చెప్పారు. దేవునికి మనలో ప్రతి ఒక్కరిపైనా సున్నితత్వం, దయ ఉంటాయని, అదేవిధంగా బిషప్‌లు కూడా వ్యవహరించాలని అన్నారు. హోమోసెక్సువాలిటీ విషయంలో నేరం, పాపం వేర్వేరని తెలిపారు. ''హోమోసెక్సువల్‌కావడం నేరం కాదు. ఇది నేరం కాదు. ఔను, కానీ అది పాపం. సరే, అయితే పాపం, నేరం మధ్య తేడాను మొదట తెలుసుకుందాం'' అన్నారు. పరస్పరం దాతృత్వాన్ని పోగొట్టే పాపమని తెలిపారు. ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ది హ్యూమన్ డిగ్నిటీ ట్రస్ట్ పోరాడుతోంది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, స్త్రీతో స్త్రీ కానీ, పురుషునితో పురుషుడు కానీ పరస్పర సమ్మతితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం నేరమని సుమారు 60 దేశాల చట్టాలు చెప్తున్నాయి. వీటిలో 11 దేశాల్లో ఈ నేరానికి మరణ శిక్ష కూడా విధించవచ్చు. ఇటువంటి చట్టాలను రద్దు చేయాలని ఐక్య రాజ్య సమితి పదే పదే పిలుపునిస్తోంది. వ్యక్తిగత గోప్యత, వివక్ష నుంచి విముక్తి వంటి హక్కులకు ఈ చట్టాల వల్ల విఘాతం కలుగుతోందని తెలిపింది. సెక్సువల్ ఓరియెంటేషన్, జెండర్ ఐడెంటిటీ వంటివాటితో సంబంధం లేకుండా అందరి మానవ హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత అంతర్జాతీయ చట్టం ప్రకారం అన్ని దేశాలకు ఉందని తెలిపింది. పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, ఇటువంటి చట్టాలు అన్యాయమైనవని తెలిపారు. వీటికి చరమగీతం పాడటానికి కేథలిక్ చర్చ్‌లు నడుం బిగించాలన్నారు. ''అది తప్పకుండా చేయాలి. అది తప్పకుండా చేయాలి'' అన్నారు. ''మనం దేవుని బిడ్డలం. మనల్ని మనల్నిగానే దేవుడు ప్రేమిస్తాడు. మన గౌరవం కోసం మనలో ప్రతి ఒక్కరం పోరాడటాన్ని ప్రేమిస్తాడ''న్నారు.


No comments:

Post a Comment