వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లిన యువకుడు !

Telugu Lo Computer
0

బెంగళూరులోని ముత్తప్ప అనే వ్యక్తి కారుని సాహిల్‌ అనే వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారులోంచి దిగి మాట్లాడాదాం అనుకుంటుండగా.. సాహిల్‌ తన బైక్‌తో పారిపోయేందుకు యత్నించాడు. అయితే వృద్ధుడు అతన్ని ఆపాలనే ఉద్దేశంతో అతని బైక్‌ బ్యాక్‌ సైడ్‌ గట్టిగా పట్టుకున్నాడు. కానీ సాహిల్‌ వృద్ధుడన్న కనికరం లేకుండా బైక్‌ని ఆపకుండా ఈడ్చు కెళ్లిపోయాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా 71 ఏళ్ల వృద్ధుడుని దాదాపు ఒక కిలోమీటర్‌ దూరం ఈడ్చుకెళ్లాడు. ఇంతలో అటుగా వస్తున్న ఆటో రిక్షా వాలా, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)