లోయలోపడ్డ మినీ బస్సు : ఐదుగురి మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 21 January 2023

లోయలోపడ్డ మినీ బస్సు : ఐదుగురి మృతి


జమ్మూకాశ్మీర్‌ లోని కథువా జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా,  15 మందికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌగ్ నుంచి డానీ పెరోల్‌కు వెళ్తున్న మినీ బస్సు.. బిలావర్‌లోని ధను పరోల్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన 15 మందిని బిలావర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


No comments:

Post a Comment