చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

Telugu Lo Computer
0


తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఆదివారం నాడు హైదరాబాద్‌లో  భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం 11.40 ప్రాంతంలో బాబు ఇంటికి పవన్ చేరుకున్నారు. దాదాపు గంటన్నర సేపు ఇరువురూ సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరు నాయకులూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ''కుప్పంలో చంద్రబాబును అడ్డుకున్నారు. వైజాగ్‌లో నన్ను అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతలు కారు ఎక్కకూడదు, దిగకూడదు అంటూ ఆంక్షలు పెట్టి తిరగకుండా చేస్తున్నారు'' అని పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ''జీవో నంబర్ 1పై ఎలా పోరాడాలి అనే దానిపై చర్చించాం. భవిష్యత్తులో ఈ జీవోను వెనక్కు తీసుకునేలా ఏం చేయాలనేది చంద్రబాబుతో మాట్లాడాను'' అని తెలిపారు. ''40 ఏళ్లకు ముందు ఇదే రోజు ఎన్‌టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు దశాబ్దాలు పూర్తయ్యాయి. ప్రతి రాజకీయ పార్టీకి ప్రణాళికలు ఉంటాయి. కానీ, వైసీపీ మాత్రం నేరాలు, రౌడీయిజం, వ్యవస్థలను నాశనం చేయడం లాంటి ఆయుధాలతో ముందుకు వెళ్తోంది'' అని చంద్రబాబు అన్నారు. నా నియోజకవర్గంలోనే ప్రజలకు పరామర్శించడానికి వెళ్తే నన్ను రానీయకుండా 2,000 మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఆంక్షలతో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అని ఆయన వివరించారు. కందుకూరు, గుంటూరుల్లో జరిగింది వైసీపీ కుట్ర. దీన్ని అమలుచేసింది పోలీసులే'' అని బాబు ఆరోపించారు. ఈ రోజు జీవో నంబరు 1పైనే మేం చర్చించాం. ఇతర అంశాలపై మాట్లాడలేదు''అని చంద్రబాబు చెప్పారు.



Post a Comment

0Comments

Post a Comment (0)