ఏక్‭ నాథ్ షిండే, ప్రకాష్ అంబేద్కర్ భేటీ !

Telugu Lo Computer
0


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ ‭నాథ్ షిండే, వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ ఏకాంతంగా సమావేశమయ్యారు. దీంతో శివసేన (షిండే వర్గం), వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీల మధ్య పొత్తు ఏర్పడబోతుందనే ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ ఊహాగానాలను వీబీఏ కొట్టిపారేసింది. ఇరు నేతల మధ్య సమావేశం రాజకీయేతరమని ప్రకటించింది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. "మూతపడిన ఇందూ మిల్లు ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించే ఇరు నేతలు సమావేశం అయ్యారు. స్మారక పనులను వేగవంతం చేయాలని బాలాసాహెబ్ (ప్రకాష్ అంబేద్కర్) ప్రయత్నిస్తున్నారు. అదే స్థలంలో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని కూడా నిర్మించాలని సీఎంకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులకు సమావేశమయ్యారు." అని వీబీఏ ప్రతినిధి సిద్ధార్థ్ మోక్లే తెలిపారు. వాస్తవానికి ఈ విషయమై గతేడాది డిసెంబర్‌లోనే ముఖ్యమంత్రి షిండేను ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆ సమయంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక ప్రాజెక్టుపై చర్చించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనతో వీబీఏ పొత్తు ఇప్పటికే ఫైనల్ వరకు వచ్చిందని, దీంతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేతులు కలిపే ప్రశ్నే లేదని ప్రకాశ్ అంబేద్కర్ వర్గీయుల సమాచారం. "వీబీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో చేతులు కలపదని బాలాసాహెబ్ (ప్రకాష్ అంబేద్కర్) విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. బీజేపీతోనే కాదు, ఆ పార్టీతో పొత్తులో ఉన్న ఏ పార్టీతోనూ వీబీఏ చేతులు కలపదు. అందువల్ల, షిండే వర్గంతో పొత్తు గురించి చర్చ నిర్వహించే ప్రశ్న అవసరం లేదు." అని మోక్లే అన్నారు. గత నెలలో, ఉద్ధవ్ థాకరే, ప్రకాశ్ అంబేద్కర్ సమావేశమై ముంబై పౌర సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)