ఘనంగా కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహం

Telugu Lo Computer
0


క్రికెటర్ కే.ఎల్. రాహుల్, సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఖాండాలోని సునీల్ శెట్టి ఫాంహౌస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో రాహుల్ అతియాకు మూడు ముళ్లు వేశారు. చాన్నాళ్లుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రాహుల్ విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అతియా కూడా రాహుల్ వెంటే కనిపించేది. అయితే, గత కొద్దిరోజుల క్రితం వీరు వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. సోమవారం ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కేఎల్ రాహుల్, అతియాశెట్టి వివాహానికి సన్నిహితులు, బంధువులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, మెంటర్ గౌతమ్ గంభీర్, ఫాస్ట్ బౌలర్ వరుణ్ అరోన్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి హాజరయ్యారు. న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ తదితరులు హాజరు కాలేకపోయారు. ఇదిలాఉంటే వివాహానికి సంబంధించిన ఫొటోలను రాహుల్, అతియాలు తమ తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో షేర్ చేశారు. వివాహానికి వచ్చిన వారికి సునీల్ శెట్టి, ఆయన తనయుడు అహన్ శెట్టి ఆహ్వానం పలికారు. వారిద్దరూ షేర్వాణీలో, నుదుట తిలకంతో కనిపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)