ఆంటిగ్వా అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పిన మెహుల్ చోక్సీ !

Telugu Lo Computer
0


పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కు పాల్పడిన మెహుల్ చోక్సీ 2018లో దేశం వదలి పారిపోయాడు. ఇతడిపై ఇంటర్ పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆంటిగ్వా దేశంలో ఉన్న ఆయన అక్కడి అధికారులకు పెద్ద ఎత్తున లంచాలను ఎరగా వేసి భారత్ కు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తేలింది. ప్రముఖ ఆర్థిక నేరా పరిశోధకుడు కెన్నెత్ రిజోక్ పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ కు అప్పగించేందుకు ఇంటర్ పోల్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడు. ఆంటిగ్వాలో సీనియర్ పోలీస్ అధికారి అడోనిస్ హెన్రీతో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు అంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నాడు. చోక్సీకి చెందిన జాలీ హార్బర్ రెస్టారెంట్ అల్ పోర్టోలో చోక్సీ, పోలీస్ అధికారి హెన్రీ రోజుకు కనీసం మూడు సార్లు కలుస్తారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులకే కాకుండా ఆంటిగ్వా మెజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్ ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని తెలిసింది. తనను భారత్ కు అప్పగించే ప్రక్రియను అడ్డుకునేందుకు చోక్సీ, హెన్రీ, క్లార్క్ లతో కలిసి కుట్ర పన్నినట్లు తేలింది. గతంలో క్యూబా పారిపోవాలని చోక్సీ ప్లాన్ వేశాడు. క్యూబాకు ఇండియాకు మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. క్యూబాకు నౌకలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే నౌకలోని స్మగ్లర్లకు ఒప్పుకున్న డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన్న డొమెనికన్ తీరంలో వదిలివెళ్లారు. ఇది 2021లో జరిగింది. ఆంటిగ్వాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి చోక్సీ అక్కడి పౌరసత్వం సంపాదించాడు. అయితే.. అక్కడి కోర్టు చోక్సీని భారత్ కు అప్పగించాలని ఆదేశించినప్పటికీ, చోక్సీ మిలియన్ల డాలర్ల నగదును దొంగిలించాడని ఆరోపిస్తూ అక్కడి అవినీతి అధికారులు, న్యాయమూర్తులు అతడి విచారణను కావాలని ఆలస్య చేస్తూ భారత్ కు అప్పగించే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)