బళ్లారిలో మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్లో శనివారం రాత్రి సింగర్ మంగ్లీ కారుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. బళ్లారి ఉత్సవ్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నది. ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆమె వెళ్తున్న కారుపై దాడికి పాల్పడ్డారు. వెంటనే పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు.ఇటీవలే చిక్‌బళ్లాపూర్‌లోని జరిగిన ఓ ఈవెంట్‌కు మంగ్లీ హాజరైంది. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్పై ఉన్న మంగ్లీకి ఇక్కడ కన్నడవాళ్లున్నారు. కన్నడలో మాట్లాడండి అని యాంకర్‌ సూచించింది. అయితే పక్కన అనంతపురం ఉంది. అందరికీ తెలుగు వస్తుందంటూ మంగ్లీ సమాధానమిచ్చింది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కన్నడలో మాట్లాడడం రానివారికి అవకాశం ఎందుకు ఇస్తున్నారని పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె కారుపై రాళ్ల దాడి జరగడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)