దీనస్థితిలో పాకీజా !

Telugu Lo Computer
0


పెద రాయుడు సినిమాలో పాకీజా గుర్తుందా ! ఇప్పుడు తిండి కూడా లేకుండా ఇలా రోడ్డు మీద సీనియర్ పాకీజా నటి రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తూ ఒక జర్నలిస్ట్ కంట పడింది. ఈ పేరు ఇప్పటివారికి తెలియకపోవచ్చు. కానీ, 90 వ దశకంలో ఉన్నవారికి ఆమె ఎంతో ఫేమస్. అసెంబ్లీ రౌడీ సినిమాలో యమా స్టైలిష్ గా బాత్రూమ్ లు కడుగుతూ బ్రహ్మానందాన్నిమీ ని బోల్తా కొట్టించిన అందగత్తె. పెదరాయుడు సినిమాలోనూ అదే పాత్రలో పేరు తెచ్చుకున్న పాకీజా, తమిళంలో ఎన్నో సినిమాలో  మంచి పాత్రలు చేసి మెప్పించింది. షుగర్ వ్యాధి వచ్చిన దగ్గర నుంచి సినిమాలకు దూరమైన ఆమె ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పుకొస్తూ కంటనీరు పెట్టుకుంది. ఆరోగ్యం సహకరించకపోవడంతో అవకాశాలు కూడా రావడం, లేదని తాన దీన పరిస్థితి గురించి తమిళనాడు సీఎం కు, నడిగర్ సంఘానికి చెప్పుకున్నా వారు పట్టించుకోవడం లేదని తెలిపింది. ప్రస్తుతం తన స్నేహితురాలిని చూడడానికి చెన్నై వచ్చినట్లు చెప్పిన ఆమె డబ్బులు లేక బస్సులో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఏమి తినలేదని చెప్పడంతో సదరు జర్నలిస్ట్ ఆమెకు రుచికరమైన భోజనం తినిపించగా, ఇలాంటి భోజనం తిని చాలా రోజులు అయ్యిందని చెప్పుకొచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)